బనగానపల్లె: ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన వేడుకలు

1939చూసినవారు
బనగానపల్లె నేలమఠంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధన మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. పీఠాధిపతి శ్రీనివాసచార్య స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు, వీర కాలికాంబదేవికి అభిషేకాలు, అలంకరణలు చేశారు. సాయంత్రం భక్తుల ఆధ్వర్యంలో పల్లకి సేవ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Job Suitcase

Jobs near you