బనగానపల్లె ఏరియా ఆసుపత్రిలో డిజిటలైజేషన్ ప్రారంభం

6చూసినవారు
బనగానపల్లె ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నిధులతో రూ. 12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 17 కంప్యూటర్లు, 5 ప్రింటర్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఆన్లైన్ పేషెంట్ రిజిస్ట్రేషన్, ఇన్‌పేషెంట్, డిశ్చార్జ్ వంటి సేవలను డిజిటల్ విధానంలో అందించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ స్థాయిలో అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

సంబంధిత పోస్ట్