కొలిమిగుండ్ల మండలంలోని చింతలాయపల్లి పరిధిలో ఉపాధి హామీ పనులు నిలిచిపోవడంతో సుమారు 400 మంది కూలీలు పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారు. చింతలాయపల్లి, మదనంతపురం, ఎస్. చెన్నంపల్లి, రాఘవరాజుపల్లి గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. కార్మిక, రైతు సంఘాల నాయకులు ఈ సమస్యపై స్పందించి, జిల్లా పీడీ సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. వెంటనే పనులు ప్రారంభించకపోతే ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.