న్యూఢిల్లీలో జరగనున్న సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌కు ఎంపికైన 52 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభినందించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో గ్రామీణ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఇస్తోన్న ప్రాధాన్యతను ఆయన వివరించారు. ఈ పర్యటన విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక అవగాహన పెంపునకు దోహదం చేస్తుందని మంత్రి తెలిపారు.