మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి బనగానపల్లెలో అభివృద్ధి పనుల పరిశీలన

0చూసినవారు
మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి బనగానపల్లెలో అభివృద్ధి పనుల పరిశీలన
బనగానపల్లె పట్టణంలో తెల్లవారుజాము నుంచి పర్యటించిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. బనగానపల్లె-కోవెలకుంట్ల రహదారి అభివృద్ధి పనుల నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు. బనగానపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించి, భవన పునర్నిర్మాణానికి అవసరమైన అంచనా వ్యయంతో పూర్తి నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. పట్టణ నలుదిక్కులా కూడళ్ల వద్ద సుందరీకరణలో భాగంగా నిర్మిస్తోన్న ప్రవేశ ద్వారాలను పరిశీలించి, ఆర్కిటెక్ట్‌లకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్