నంద్యాల జిల్లా బనగానపల్లె శాసనసభ్యులు, మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి రేపు, అనగా 01-01-2026 గురువారం నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా అందుబాటులో ఉండరు. ఆయన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సమాచారాన్ని మంత్రి గారి క్యాంప్ కార్యాలయం, బనగానపల్లె తెలియజేసింది.