బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. న్యాయబద్ధమైన అంశాలపై అధికారులతో అక్కడిక్కడే ఫోన్‌లో మాట్లాడి చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.