Dec 01, 2025, 02:12 IST/కూకట్పల్లి
కూకట్పల్లి
హైదరాబాద్‌లో హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్
Dec 01, 2025, 02:12 IST
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని లెమన్ ట్రీ రెడ్ ఫాక్స్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హోటల్లో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, డాగ్ స్క్వాడ్‌తో కలిసి మూడు గంటల పాటు హోటల్లో సోదాలు నిర్వహించగా, ఎటువంటి బాంబు కనుగొనబడలేదు. ఈ ఘటనతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.