ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


అమెరికా బాటలోనే మెక్సికో.. భారత్‌పై 50 శాతానికి సుంకాలు పెంపు
Dec 11, 2025, 14:12 IST/

అమెరికా బాటలోనే మెక్సికో.. భారత్‌పై 50 శాతానికి సుంకాలు పెంపు

Dec 11, 2025, 14:12 IST
భారత్, చైనా, దక్షిణ కొరియా వంటి పలు దక్షిణాసియా దేశాల నుంచి దిగుమతులపై మెక్సికో భారీగా సుంకాలు పెంచే బిల్లుకు ఆ దేశ సెనెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం, కనీసం 5 శాతం నుంచి 50 శాతం వరకు దిగుమతి సుంకాలు పెంచనున్నారు. ఈ కొత్త సుంకాలు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నాయి. దుస్తులు, లోహాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ఉక్కు వంటి అనేక ఉత్పత్తులపై వీటి ప్రభావం పడనుంది. దేశీయ తయారీని పెంచడం, చైనాతో వాణిజ్య అసమతుల్యతలను పరిష్కరించడం ఈ నిర్ణయం వెనుక కారణాలని మెక్సికో ప్రభుత్వం పేర్కొంది.