డోన్ నియోజకవర్గంలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, పీడియాట్రీషియన్ మాధవ్ కృష్ణ ఆదివారం మాట్లాడుతూ, చిన్నారులు హైపోథెర్మియాకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు పడిపోతున్నందున తల్లిదండ్రులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని, శిశువులను వెచ్చగా ఉంచాలని, తల్లిపాలు ఇస్తూ, వెచ్చని దుస్తులు, దుప్పట్లు, స్వెటర్లు వాడాలని సూచించారు. బయటకు తీసుకెళ్లేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.