కర్నూల్ జిల్లా, వెల్దుర్తి మండలం, చర్లకోత్తూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని మంజూరు చేయాలని కోరుతూ, గ్రామ ప్రతినిధులు పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ KE శ్యామ్ కుమార్ గారికి వినతిపత్రం సమర్పించారు. పాఠశాల భద్రత, విద్యార్థుల రక్షణ దృష్ట్యా కాంపౌండ్ వాల్ అత్యవసరమని, లేకపోతే పశువులు, బయటి వ్యక్తులు ప్రవేశించి విద్యార్థుల భద్రతకు ఆటంకం కలిగిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గారు వినతిని సానుకూలంగా స్వీకరించి, పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.