డోన్ మున్సిపల్ కార్మికుల సమస్యలపై CITU నేతలు మంగళవారం చైర్మన్ సప్తశైల రాజేష్, కమిషనర్ ప్రసాద్ గౌడ్‌లతో చర్చించారు. రిటైర్మెంట్ అయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు, పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు, గ్రాట్యూటీ, ఎక్స్గ్రేషియా పెంపు, సమ్మెకాలపు బకాయిలు సహా పెండింగ్ హామీలను వెంటనే అమలు చేయాలని వారు కోరారు. ప్రజారోగ్యానికి సేవలు అందించే కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు నిర్బంధంగా వర్తించాలని నాయకులు నొక్కి చెప్పారు.