డోన్: హంద్రీనీవా పైప్‌లైన్ లీకేజీపై ఎమ్మెల్యే తనిఖీ

9చూసినవారు
డోన్: హంద్రీనీవా పైప్‌లైన్ లీకేజీపై ఎమ్మెల్యే తనిఖీ
శనివారం డోన్ మండలం ఓబుళాపురం సమీపంలో హంద్రీనీవా పైప్‌లైన్ పగిలి నీరు వృథాగా పోతున్న ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించిన ఆయన, అధికారులతో మాట్లాడి అత్యవసర మరమ్మత్తులు చేపట్టి లీకేజీని నిలిపివేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కనుగొనాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్