నంద్యాల జిల్లా డోన్ మండలం జగదుర్తి సమీపంలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. రాంగ్ రూట్‌లో వాహనం నడపడం వల్ల ముగ్గురు మరణించినట్లు ఆయన వెల్లడించారు. క్రేన్ డ్రైవర్, యజమానిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పదేళ్ల వరకు జైలు శిక్ష తప్పదని డీఎస్పీ హెచ్చరించారు.