డోన్ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మంగళవారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, ఆర్ అండ్ బీ, ఫారెస్ట్, పవర్ గ్రిడ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోరుకల్ రిజర్వాయర్ నుండి నీటి సరఫరా, పైపులైన్ పనుల్లో ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, నేషనల్ హైవే 340బీ పనులు సజావుగా కొనసాగేలా శాఖలు సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.