అక్రమ మద్యం వ్యవహారంలో డోన్ ఎక్సైజ్ సీఐ వరలక్ష్మిని సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన సోమనాథ్ విచారణలో సీఐ తనకు మద్యం అమ్మినట్లు వెల్లడించాడని, ఈ నేపథ్యంలోనే ఆమెపై చర్యలు తీసుకున్నామని రవికుమార్ పేర్కొన్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.