డోన్: గుండాలలో రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే కోట్ల

3చూసినవారు
డోన్: గుండాలలో రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే కోట్ల
డోన్ మండలం గుండాల గ్రామంలో శనివారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. రైతు సంక్షేమంపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. రాజకీయ చిహ్నాలు లేకుండా, ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో పారదర్శకంగా నూతన పట్టాదారు పాసుపుస్తకాలు రూపొందించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6,688 గ్రామాల్లో 21.80 లక్షల రైతులకు వీటిని పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్