డోన్: అంగన్వాడీల అరెస్టులపై సీఐటీయూ నిరసన

7చూసినవారు
డోన్: అంగన్వాడీల అరెస్టులపై సీఐటీయూ నిరసన
విజయవాడలో అంగన్వాడీ వర్కర్స్ అరెస్టులను సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. అలంకార్ సెంటర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిని తెల్లవారుజామున అరెస్టు చేయడం అన్యాయమని పేర్కొంది. డోన్లో ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కనీస వేతనాలు, గ్రాట్యుటీ, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించి, అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్