డోన్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 20న 30 మందికి పైగా
విద్యార్థులు వాంతులు, విరేచనాలు, అస్వస్థతతో బాధపడ్డారు. అయితే, ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు యాజమాన్యం విద్యార్థులను ఆస్పత్రికి తరలించకుండా RMP ద్వారా చికిత్స చేయించినట్లు సమాచారం. ఈ ఘటనపై వివరణ కోరగా, నలుగురికి మాత్రమే ఫుడ్ పాయిజన్ అయిందని MEO ప్రభాకర్ సోమవారం తెలిపారు.