
కూతురిని కాపాడేందుకు నీటిలో దూకి, ప్రాణాలు కోల్పోయిన తల్లి
TG: నాగర్‌కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామంలో అనూష(35) అనే మహిళ తన కూతురు అక్షిత(10)కు ఈత నేర్పిస్తుండగా.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుండటంతో, ఆమెను కాపాడేందుకు నీటిలోకి దూకింది. అయితే అనూషకు ఈత రాకపోవడంతో.. ఆమె కూడా నీటిలో మునిగి మరణించింది. కూతురు అక్షితను మాత్రం సురక్షితంగా బయటకు తీశారు. ఈ విషాద ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.




