ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న సిమెంట్ నగర్ కార్మికుల కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి. పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీలో నైపుణ్యం పొందిన పలువురు కార్మికులు ఉపాధి నిమిత్తం కువైట్, దుబాయ్, లిబియా వంటి దేశాలకు వెళ్లడంతో వారి కుటుంబీకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బేతంచెర్ల మండల వాసుల్లో ఈ ఆందోళన నెలకొంది.