డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి సమృద్ధి కోసం శుక్రవారం హనుమాన్ సుందరకాండ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శ్రీనివాస్ స్వామిజీ వేద మంత్రోచ్ఛారణలతో పారాయణం నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.