కర్నూలు డీసీసీ అధ్యక్షుడు, అడ్వకేట్ క్రాంతి నాయుడు ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కర్నూలులోని జిల్లా
కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంలో ఓటు చోరీ నుంచి సీట్ చోరీ వరకు జరుగుతోందని ఆరోపించారు.
నీట్ పేపర్ లీక్, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలతో యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. జెన్ జీ యువత
కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.