డోన్ పట్టణంలోని పురాతన శ్రీ పాత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస ఏకాదశి సందర్భంగా లక్ష దీపోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్తలు బైసాని రాజు, అరటిపండ్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో భక్తులు వేలాది దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. భజన మండళీల గీతాలతో దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక కాంతులీనం అయింది.