స్వచ్ఛ ఆంధ్రపై విద్యార్థులకు అవగాహన: మహమ్మద్ రఫి పిలుపు

3చూసినవారు
డోన్ పట్టణంలోని ఎన్ ఎన్ కాలనీ ఎంపీపీ స్కూల్లో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో, హెచ్ఎం ఎల్.వి. రమణారావు అధ్యక్షతన హైస్కూల్ విద్యార్థులకు 'స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్' పై అవగాహన సదస్సు జరిగింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని, మొక్కలు నాటాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి నెల మూడవ శనివారం 'స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్' నిర్వహణకు ప్రభుత్వం ప్రణాళిక వేసిందని, ప్రజలు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తేనే స్వచ్ఛాంధ్ర సాధ్యమని మహమ్మద్ రఫి తెలిపారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో పాటు దోమల నివారణ, వాతావరణ కాలుష్య నివారణ, నీటి వృధాను అరికట్టడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్