శకుంతలాదేవి జయంతి: డోన్ లో ఘనంగా నివాళి

5చూసినవారు
శకుంతలాదేవి జయంతి: డోన్ లో ఘనంగా నివాళి
నవంబర్ 04న, డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలాదేవి జయంతిని ఘనంగా నిర్వహించారు. అతి వేగంగా గణనలు చేయడంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన శకుంతలాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా, మహమ్మద్ రఫి దేశ స్వాతంత్ర్య సమరయోధులు, శాస్త్రవేత్తలు, మహనీయులు, సమాజానికి సేవ చేసిన ప్రతి ఒక్కరినీ స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్