బేతంచెర్లలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా 46 మంది దంపతులు సామూహిక హోమంలో పాల్గొన్నారు. జలాభిషేకం, పంచామృతాభిషేకం అనంతరం పుష్పాలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమం ముగింపులో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.