
డోన్: టమాటా ధరలు పడిపోవడంతో రైతు పంట నష్టం
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం సీతారామపురానికి చెందిన రైతు తెలుగు శ్రీనివాసులు, టమాటా పంటకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో తీవ్ర నష్టపోయారు. రూ. 80 వేలు పెట్టుబడి పెట్టినా, కిలో ధర కేవలం రూ. 3కే పరిమితం కావడంతో ఆయన తన పంటను దున్నేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు విజ్ఞప్తి చేశారు.







































