
రైలు కింద పడి వ్యక్తి మృతి
డోన్ మండలంలోని దొరపల్లె రైల్వే గేట్ సమీపంలో బుధవారం రాత్రి దారుణ సంఘటన జరిగింది. అమరావతి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి చిట్యాలకు చెందిన తలారి మధు అనే వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలిసిన రైల్వే పోలీసులు వెంటనే ఘటనస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తర్వాత పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి, పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






































