
బేతంచెర్ల లైన్ మన్ కు ఉత్తమ అవార్డు
బేతంచెర్ల పట్టణానికి చెందిన నాగ రాజా శేఖర్ ను ఏపీ ప్రభుత్వం ఉత్తమ లైన్ మన్ గా ప్రకటించింది. ప్రజలకు సేవ చేసినందుకు గాను ఈ పురస్కారం లభించింది. మార్చి 7వ తేదీన ఢిల్లీలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏడి మధు సుధన్ రెడ్డి, ఏఈలు శివన్న, శ్రీనివాసులు, సిబ్బంది నాగరాజా శేఖర్ ను అభినందించారు.







































