
డోన్: సంక్రాంతి వేళ జూదాలకు నిషేధం: డీఎస్పీ
డోన్ డీఎస్పీ శ్రీనివాసులు మంగళవారం ప్రజలకు సంక్రాంతి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పండుగ సందర్భంగా కోడి పందేలు, గుండాట, జూదం వంటి అక్రమ ఆటలపై పూర్తిస్థాయి నిషేధం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని, సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకుంటూ చట్టానికి సహకరించాలని ప్రజలను కోరారు.






































