డోన్ - Dhone

సావిత్రి బాయి జయంతి: మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహణ

సావిత్రి బాయి జయంతి: మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహణ

నంద్యాల, డోన్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్యాపిలిలో, జాతీయ సేవా పథకం (NSS) ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జనవరి 3న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం, సావిత్రి బాయి చిత్రపటానికి పూలమాల వేసి, ఆమె భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా, సామాజిక సంస్కర్తగా చేసిన సేవలను కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె కృషి చేశారని తెలిపారు. NSS ప్రోగ్రాం ఆఫీసర్ నవీన పాటి, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా