Nov 13, 2025, 11:11 IST/
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మిస్తే.. వేగంగా బిల్లులు మంజూరు: భట్టి విక్రమార్క
Nov 13, 2025, 11:11 IST
TG: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలోని ముదిగొండ మండలంలో గురువారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కీలక సూచన చేశారు. లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకుంటే.. వారికి అంతే వేగంగా బిల్లులు మంజూరవుతాయని భట్టి భరోసా ఇచ్చారు. నిర్మాణం పురోగతి ఆధారంగానే నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని అన్నారు.