Dec 15, 2025, 16:12 IST/
హైదరాబాద్లో రాష్ట్రపతి శీతాకాల విడిది తేదీలు ఖరారు
Dec 15, 2025, 16:12 IST
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 17 నుంచి 22 వరకు హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ విమానాల ఎగరవేతపై నిషేధం విధిస్తూ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.