Feb 08, 2026, 06:02 IST/ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం
అమెరికా జట్టులో తెలుగు కుర్రాడు సాయి తేజ ముక్కమల్ల!
Feb 08, 2026, 06:02 IST
అమెరికా జట్టులో ఎక్కువమంది ఆటగాళ్లు భారతీయులు, భారత సంతతికి చెందినవారే. వీరిలో తెలుగు రాష్ట్రానికి చెందిన సాయి తేజ ముక్కమల్ల ఒకడు. అతని తండ్రి ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం కమలాపురి గ్రామానికి చెందినవారు. సాయి తేజ అమెరికాలోనే పుట్టి పెరిగాడు. వి.వి.ఎస్. లక్ష్మణ్ అకాడమీలో శిక్షణ పొందిన సాయి తేజ, అమెరికా జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఈ యువ క్రికెటర్ మనవాడేనని వార్తలు వస్తున్నాయి.