
కర్నూలు: హోమ్ గార్డులకు బియ్యం ప్యాకెట్లు పంపిణీ
కర్నూలు జిల్లాలో పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని సోమవారం కర్నూలు డీఎస్పీ జె. బాబు ప్రసాద్ కర్నూలు సబ్ డివిజన్‌లోని 100 మంది హోమ్ గార్డులకు బియ్యం ప్యాకెట్లను అందజేశారు. కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ తబ్రేజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, సమాజ సేవలో భాగస్వాములవుతున్న మహేశ్వర్ రెడ్డి, ఈదుల దేవరబండ సుభాన్, క్వాలిటీ టైల్స్ రఫీ, మదీనా స్వీట్స్ రహమతుల్లా వంటి ప్రముఖులను సత్కరించారు. మౌలానా సలామ్ ప్రత్యేక దువా నిర్వహించి, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.







































