ఆదివారం, కోడుమూరు పట్టణంలోని సుందరయ్య నగర్‌కు చెందిన టీడీపీ నాయకులు ఎ. రాముడుతో సహా 300 మందికి పైగా జనసేన పార్టీలో చేరారు. జనసేన సీనియర్ నాయకుడు సంధ్య విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని కోరారు. బాలకృష్ణ గౌడ్, షాలుబాషా, క్రిష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.