ఈర్లదిన్నెలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

5చూసినవారు
ఈర్లదిన్నెలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
బుధవారం, సి. బెళగల్ మండలం ఈర్లదిన్నె గ్రామంలో శివపార్వతులు, సీతారామలక్ష్మణులు, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజల శ్రేయస్సు, శాంతి, సుభిక్షం కోసం ప్రార్థించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్