బూడిదపాడు: బడి పిలుస్తుంది కింద ఎన్రోల్మెంట్ డ్రైవ్

6చూసినవారు
బూడిదపాడు: బడి పిలుస్తుంది కింద ఎన్రోల్మెంట్ డ్రైవ్
విద్యార్థుల చేరికలను పెంచే లక్ష్యంతో "బడి పిలుస్తుంది" కార్యక్రమం కింద జెడ్పీహెచ్ఎస్ బూడిదపాడు పాఠశాల ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలోని ప్రతి వీధిని సందర్శించి, బడికి రాని విద్యార్థులు మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం వంటి సౌకర్యాలను వివరించి, తమ పిల్లలను సమీప పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్