గూడూరు పీహెచ్‌సీలో ఆశా వర్కర్లకు అవగాహన సమావేశం

3చూసినవారు
గూడూరు పీహెచ్‌సీలో ఆశా వర్కర్లకు అవగాహన సమావేశం
గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ షఫీయా ఆధ్వర్యంలో మంగళవారం ఆశా డే సమావేశం జరిగింది. నీళ్ల విరోచనాలు, వాంతులు, డీహైడ్రేషన్ లక్షణాలు, నివారణ చర్యలపై ఆశావర్కర్లకు అవగాహన కల్పించారు. ఓఆర్‌ఎస్, జింక్ మాత్రలు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఘన వ్యర్థాల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఇంటి చెత్తను మున్సిపల్ సిబ్బందికి అందించి రీసైక్లింగ్‌కు సహకరించాలని, రైతులు పంట వ్యర్థాలను సేంద్రియ ఎరువులుగా వినియోగించుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్