కోడుమూరులో బైక్ ప్రమాదం – సీఐ సమయస్ఫూర్తి

3చూసినవారు
ఆదివారం రాత్రి కోడుమూరు పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన సీఐ పి. శ్యామరావు వెంటనే స్పందించి, గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్‌లో కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్