శుక్రవారం, కోడుమూరు నియోజకవర్గం సి. బెళగల్ మండలం పోలకల్ గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, ఎంఫిపి మునెప్ప, సోమశేఖర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.