కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బుధవారం సి. బెళగల్ కు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి తెలుగు మధు చెరువు సమీపంలోని బావిలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. ఇంటికి తిరిగి రాని కుమారుని కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు బావి వద్ద మధు దుస్తులు కనిపించాయి. స్థానిక జాలర్లు బావిలో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.