మూడుములగుర్తిలో క్రికెట్ క్రీడా టోర్నమెంట్ ప్రారంభం

4చూసినవారు
మూడుములగుర్తిలో క్రికెట్ క్రీడా టోర్నమెంట్ ప్రారంభం
కోడుమూరు మండలం మూడుములగుర్తిలో నవరత్నాల లక్ష్మీ నరసింహ స్వామి–ఈరన్న స్వామి జాతర మహోత్సవం ఘనంగా జరుగుతోంది. గురువారం వైఎస్సార్‌సీపీ ఎస్ఈసీ సభ్యుడు, మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేదమంత్రాల నడుమ పూజారులు పూజలు నిర్వహించగా, నేతలు స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. జాతర వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌ను నేతలు సంయుక్తంగా ప్రారంభించారు.

ట్యాగ్స్ :