కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడు గ్రామంలో వ్యాపార నష్టాలు, అప్పుల బాధతో మాల మునిస్వామి (57) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కిరాణా దుకాణం నడిపిస్తున్న ఇతను ఈనెల 25న విషద్రావణం తాగి ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.