కోడుమూరు నియోజకవర్గంలో సోమవారం, లబ్ధిదారులకు రూ. 4,62,934/- విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పంపిణీ చేశారు. ప్రజలకు ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ బాధ్యత అని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. లబ్ధిదారులు సీఎం, డి. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే దస్తగిరికి కృతజ్ఞతలు తెలిపారు.