సి. బెళగల్ మండలంలోని మూడుమాల గ్రామంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఈ. వెంకట లక్ష్మి పాల్గొని, రైతులు భూ రికార్డులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జి. తరుణ్, గ్రామ రెవెన్యూ అధికారులు అక్బర్, రఫీ తదితరులు పాల్గొన్నారు.