ఎర్రదొడ్డి: అదనపు కట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

2చూసినవారు
ఎర్రదొడ్డి: అదనపు కట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
అదనపు కట్నం కోసం అత్తారింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేవనకొండ మండలంలో చోటుచేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు, బేతపల్లికి చెందిన కోతింటి సుధాకర్‌కు రెండేళ్ల క్రితం వివాహమైన ఐశ్వర్య(20)ను అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబ సభ్యులు మానసికంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులు తాళలేక ఈనెల 26వ తేదీన ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, మామ, అత్త, మరదిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్