బికెఎంయు రాష్ట్ర సదస్సును జయప్రదం చేసేందుకు కోడుమూరు నియోజకవర్గం నుంచి వ్యవసాయ కూలీలు భారీగా తరలివెళ్లారు. శనివారం గూడూరులో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆటోలపై బ్యానర్లతో సదస్సుకు చేరుకున్న కూలీలు, ఉపాధి హామీ పథకంలో రోజుకు రూ. 800 వేతనం, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.