గూడూరు: ఈనెల 5న ఏఐటీయూసీ మహాసభను జయప్రదం చేయాలి

16చూసినవారు
గూడూరు: ఈనెల 5న ఏఐటీయూసీ మహాసభను జయప్రదం చేయాలి
కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరులో ఈనెల 5న జరగనున్న ఏఐటీయూసీ మండల మహాసభను జయప్రదం చేయాలని నాయకులు బీడీల శ్రీనివాసు, ఆటో ఓబులే తెలిపారు. మంగళవారం గూడూరులో హమాలీ యూనియన్ అధ్యక్షుడు లక్ష్మన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, కొత్త బస్టాండ్ నుండి ఊరేగింపు, పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునియప్ప, కోడుమూరు నేతలతో గ్రామాల కార్మికులు పెద్ద ఎత్తున హాజరై పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్